రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లా పరిధిలోని 51 పంచాయితీలును సమీప మున్సిపాలిటీల్లో వీలినం చేస్తు తెలంగాణ ప్రభుత్వం శ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న51 గ్రామ పంచాయతీ లను పరిసర మున్సిపాలిటీ ల్లో విలీనం చేయడాన్ని తెలంగాణ హైకోర్టు సమర్ధించింది. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ 3 సబబేనని తేల్చిచెప్పింది. విలీనాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పలు పిటిషన్లను కొట్టివేసింది.
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా, కీసర మండలంలోని రాంపల్లి దాయార, కీసర, బోగారం, యాద్గారపల్లి గ్రామాలను సమీప మున్సిపాలిటీలో విలీనం చేయడంపై వివరణ ఇవ్వా లని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేస్తూ, తదుపరి విచారణను ఈ నెల 21కి వాయిదా వేసింది. ఓటర్ రింగ్ రోడ్డు సమీపంలో ఉన్న 51 జీపీల విలీనానికి కేబినెట్ కమిటీ సిఫారసు చేయగా, సెప్టెంబర్ 3న ప్రభుత్వం ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది.
గ్రామ పంచాయతీల విలీనంతో ఔటర్ రింగు రోడ్డు పరిధి మొత్తం పూర్తి పట్టణ ప్రాంతంగా మార నుంది. రంగారెడ్డి జిల్లా పరిధిలో 12 గ్రామాలను 4 మున్సిపాలిటీల్లో కలపగా అత్యధికంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పరిధిలోని 28 గ్రామాలను 7 మున్సిపాలిటీల్లో విలీనం చేశారు. సంగారెడ్డి జిల్లా పరిధిలో 11 గ్రామాలను అక్కడి రెండు మున్సిపా లిటీల్లో ప్రభుత్వం విలీనం చేసింది…