టెస్లా ..స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ గుకేశ్ కి సోషల్ మీడియా వేదికగా అభినందనలు చెప్పారు.ఈ మేరకు ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా కంగ్రాట్స్ చెబుతూ మస్క్ స్పెషల్ పోస్ట్ పెట్టారు. ఇప్పుడీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారత యువ గ్రాండ్ మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన విషయం తెలిసిందే. చైనాకు చెందిన డింగ్ లిరెన్‌ను ఓడించి గుకేశ్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించాడు. 18 ఏళ్లకే ఇలా వరల్డ్ చెస్ ఛాంపియన్‌గా నిలిచాడు. తద్వారా ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడైన (18ఏళ్ల 8నెలల 14రోజులు) ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.