HomePoliticalమీ శిష్యుడికి కొంచెం చెప్పండి..కేటీఆర్

మీ శిష్యుడికి కొంచెం చెప్పండి..కేటీఆర్

మాజీ మంత్రి కేటీఆర్ తాజాగా ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిల‌ను ప్ర‌స్తావిస్తూ ‘ఎక్స్’ (ట్విట్ట‌ర్‌) వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర పోస్టు చేశారు. ఇప్పుడీ ట్వీట్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. గ‌త దశాబ్ద కాలంగా ప్ర‌గ‌తిశీల ప్ర‌భుత్వ విధానాల వ‌ల్ల దేశంలోనే అత్య‌ధిక త‌ల‌స‌రి ఆదాయం క‌లిగిన రాష్ట్రంగా తెలంగాణ అవ‌త‌రించింద‌ని కేటీఆర్ అన్నారు. ఈ విష‌యాన్ని ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు కూడా అనేక సంద‌ర్భాల్లో ప్ర‌స్తావించార‌ని గుర్తు చేస్తూ ఆయ‌న మాట్లాడిన వీడియోను త‌న ట్వీట్‌కు జోడించారు కేటీఆర్‌. థ్యాంక్యూ చంద్ర‌బాబు గారూ.. ద‌య‌చేసి ఈ వాస్త‌వాన్ని జీర్ణించుకోలేని మీ పూర్వ శిష్యుడికి దీనిపై అవ‌గాహ‌న క‌ల్పించండి అని ట్వీట్‌లో రాసుకొచ్చారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img