HomePoliticalయుద్దం మానేసి..పోర్న్ చూస్తున్న ఆర్మీ..?

యుద్దం మానేసి..పోర్న్ చూస్తున్న ఆర్మీ..?

ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యాకు సాయంగా వెళ్లిన ఉత్తర కొరియా సైన్యానికి అపరిమిత స్వేచ్ఛ దొరికింది. దీంతో వారు యుద్ధాన్ని పక్కనపెట్టి ఇన్నాళ్లు తమకు దూరమైన స్వేచ్ఛను అనుభవిస్తున్నట్టు బ్రిటన్ వార్తా సంస్థ ‘ది ఫైనాన్షియల్ టైమ్స్’ పేర్కొంది. ఉక్రెయిన్‌ సరిహద్దులకు చేరుకున్న ఉత్తర కొరియా సైన్యానికి ఇంటర్నెట్ అందుబాటులోకి రావడంతో అక్కడ వారు ‘పోర్న్’ చూడటంలో మునిగి తేలుతున్నట్టు తెలిపింది. గతంలో ఇటువంటి వెసులుబాటు లేకపోవడంతో అందివచ్చిన అవకాశాన్ని వారు ‘సద్వినియోగం’ చేసుకున్నట్టు పత్రిక తన కథనంలో రాసుకొచ్చింది.

అయితే, ఈ సమాచారం ఎలా సేకరించిందన్న వివరాలను వెల్లడించలేదు. రష్యాకు మద్దతుగా దాదాపు 11 వేల మంది ఉత్తర కొరియా సైనికులు రష్యా చేరుకున్నట్టు వార్తలు వచ్చాయి. దక్షిణ కొరియాతోపాటు, ‘నాటో’ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. ఇలా వెళ్లిన కిమ్ సైన్యం తూర్పు రష్యాలో శిక్షణ పొందుతున్నట్టు ఉక్రెయిన్ వర్గాలు పేర్కొన్నాయి. శిక్షణ అనంతరం కుర్స్క్‌లో వారిని మోహరించారని, వారిలో చాలామందిని తాము చంపేశామని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ నిన్న ప్రకటించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img