HomeEntertainmentధ‌ర్మంకోసం పోరాటం..ప‌వ‌న్ క‌ల్యాణ్ పోస్ట‌ర్

ధ‌ర్మంకోసం పోరాటం..ప‌వ‌న్ క‌ల్యాణ్ పోస్ట‌ర్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న చిత్రం హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు చివ‌రి షెడ్యూల్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్ జాయిన్ అయిన‌ట్లు చిత్ర‌బృందం తాజాగా ప్ర‌క‌టించింది.ఈ సంద‌ర్భంగా కొత్త పోస్ట‌ర్‌ను పంచుకుంది. ధర్మం కోసం పోరాటంలో ఆఖరి అధ్యాయం మొదలు అంటూ ప‌వ‌న్ నిలుచున్న ఫొటోను పంచుకుంది. ఈ మూవీని 2025 మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్న‌ట్లు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. రూల్స్ రంజన్ ద‌ర్శ‌కుడు జ్యోతి కృష్ణ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా.. రెండు భాగాలుగా వ‌స్తున్న ఈ చిత్రం మొద‌టి పార్ట్ ‘హరిహర వీరమల్లు పార్ట్‌: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో ప్రేక్షకుల రాబోతున్నది. ఈ చిత్రంలో నిధి అగర్వాల్‌ ఫీ మేల్ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్‌, న‌ర్గీస్ ఫ‌క్రీ, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. లెజెండరీ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఎంఎం కీర‌వాణి ఈ చిత్రానికి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్ స్కోర్‌ అందిస్తున్నాడు‌‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img