HomeDevotionalశ్రీవారి దర్శనం.. టోకెన్ల జారీని ప్రారంభించిన టిటిడి ఛైర్మ‌న్

శ్రీవారి దర్శనం.. టోకెన్ల జారీని ప్రారంభించిన టిటిడి ఛైర్మ‌న్

తిరుమల: స్థానికులకు తిరుమల శ్రీవారి దర్శన టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభమైంది. తిరుపతిలో తితిదే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు దీన్ని ప్రారంభించారు.. నగరంలోని మహతి ఆడిటోరియంలో ఈవో శ్యామలరావుతో కలిసి స్థానికులకు టోకెన్లను అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్‌ నాయుడు మాట్లాడుతూ.. నవంబర్ 18న జరిగిన తితిదే బోర్డు తొలి సమావేశంలో ప్రతి నెల మొదటి మంగళవారం స్థానికులకు శ్రీవారి దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

తితిదే ఈవో శ్యామలరావు మాట్లాడుతూ.. స్థానికుల కోసం తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో 7 కౌంటర్లు, తిరుమల బాలాజీ నగర్‌లోని కమ్యూనిటీ హాల్‌లో 3 కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం తిరుపతిలో 2,500, తిరుమలలో 500 టోకెన్లు జారీ చేస్తామన్నారు. ఒరిజినల్ ఆధార్ కార్డుతో తిరుపతి అర్బన్, తిరుపతి రూరల్, చంద్రగిరి, రేణిగుంట, తిరుమల నివాసితులకు టోకెన్లు జారీ చేయనున్నట్లు చెప్పారు. ప్రతి నెల మొదటి ఆదివారం రెండు కేంద్రాల్లోనూ దర్శన టోకెన్లు జారీ చేయనున్నట్లు తెలియజేశారు..స్థానిక భక్తులు ఒకసారి శ్రీవారిని దర్శనం చేసుకున్న 90 రోజుల తర్వాత మాత్రమే తదుపరి దర్శనానికి అర్హులు. భక్తులు సులువుగా టోకెన్లు పొందేందుకు వీలుగా క్యూలైన్లు, టోకెన్ల జారీకి అన్ని ఏర్పాట్లను తితిదే పూర్తి చేసింది. కార్యక్రమంలో తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img