HomeSports'ష‌మి' వ‌చ్చేస్తున్నాడు

‘ష‌మి’ వ‌చ్చేస్తున్నాడు

గాయం నుంచి కోలుకున్న టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమి బోర్డర్ – గావస్కర్ ట్రోఫీలో చివరి రెండు టెస్టుల్లో పాల్గొనేందుకు సిద్దమవుతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి. షమి ఫిట్‌నెస్‌పై జాతీయ క్రికెట్ అకాడమి (ఎన్‌సీఏ) వైద్య బృందం మరి కొద్ది రోజుల్లో క్లియరెన్స్ ఇవ్వనుందని, ఆ వెంటనే షమి ఆస్ట్రేలియా పయనం కానున్నారని సమాచారం. ఈ క్రమంలోనే షమి వీసా కూడా సిద్దమయినట్లు వార్తలు వినబడుతున్నాయి. ఇప్పటికే అతనికి సంబంధించిన క్రికెట్ కిట్‌ను ఆస్ట్రేలియాకు పంపారని అంటున్నారు. షమి ఆస్ట్రేలియాతో చివరి రెండు టెస్టులకు అందుబాటులో ఉంటాడని, అతను ఫిట్‌గా ఉన్నాడని బెంగాల్ హెడ్ కోచ్ లక్ష్మీ రతన శుక్లా పేర్కొన్నాడు.

భారత జట్టులో పునరాగమనం కోసం ఎదురుచూస్తున్న షమీ .. ఇటీవల రంజీ ట్రోఫీలో బెంగాల్ తరుపున ఆడి మధ్యప్రదేశ్‌పై ఐదు వికెట్లు సాధించి ఫిట్‌నెస్, ఫామ్ నిరూపించుకున్నాడు. ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ ఆలీ ట్రోఫీలో బెంగాల్ తరుపున ఆడుతున్నాడు. ఈ టీ 20 టోర్నీలో నాకౌట్ మ్యాచ్‌లు బెంగళూరులో జరుగుతుండగా, బెంగాల్ కూడా నాకౌట్‌కు అర్హత సాధించింది. డిసెంబర్ 9న ప్రిక్వార్టర్స్‌లో చండీగఢ్, బెంగాల్ తలపడనున్నాయి. బెంగాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఎన్‌సీఏ మెడికల్ బృందం .. షమి ఫిట్‌నెస్‌ను పరిశీలిస్తారని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img