నేషనల్ క్రష్ రష్మిక మందన్న, తన వృత్తిపరమైన జీవితంలో ఎదుర్కొంటున్న ఓ కష్టాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తెల్లవారుజామున చేసే విమాన ప్రయాణాలు తనను ఎంతగా ఇబ్బంది పెడుతున్నాయన్న విషయాన్ని ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో వెల్లడించారు. ఈ ప్రయాణాలు అత్యంత దారుణంగా ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు.ఉదయం 3:50 గంటలకు విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు కిటికీలోంచి తీసిన ఒక ఫొటోను రష్మిక షేర్ చేశారు. “ఉదయం 3:50 గంటల ఫ్లైట్లు చాలా దారుణంగా ఉంటాయి. అది పగలో, రాత్రో కూడా అర్థం కాదు” అని ఆమె తన పోస్టులో రాసుకొచ్చారు. అయితే, తన ప్రయాణ గమ్యం గురించిన వివరాలను ఆమె వెల్లడించలేదు.రెండు గంటలు నిద్రపోయి లేచి పని మొదలుపెట్టాలా? అలా చేస్తే రోజంతా నీరసంగా ఉంటుంది. లేదంటే, అసలు నిద్రపోకుండా రోజంతా పనిచేసి ఆ తర్వాత నిద్రపోవాలా? అలా చేసినా నీరసంగానే ఉంటుంది. రోజూ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడమే నాకు చాలా కష్టంగా అనిపిస్తోంది” అని రష్మిక ఆవేదనను వ్యక్తం చేశారు.