నేడు తిరుపతిలో ముగ్గురు ముఖ్యమంత్రులు పర్యటించనున్నారు. ఆధ్యాత్మిక కేంద్రమైన తిరుపతిలో నేటి నుంచి మూడు రోజుల పాటు అంటే 19 వ తేదీ వరకు టెంపుల్ ఎక్స్ పో 2025 జరగనుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్..ఈ సదస్సును ప్రారంభించనున్నారు. ఈ అంతర్జాతీయ సదస్సులో భాగంగా నిపుణుల మధ్య ఆలయాలపై చర్చలు, వర్క్ షాప్ లు నిర్వహిస్తారు. దాదాపు 58 దేశాల్లోని సుమారు 1581 భక్తి సంస్థల భాగస్వామ్యంతో ఈ ఇంటర్నేషనల్ టెంపుల్స్ కన్వెన్షన్ అండ్ ఎక్స్‌పోను మహాకుంభ్ ఆఫ్ టెంపుల్స్‌గా తిరుపతిలోని ఆశా కన్వెన్షన్‌లో నిర్వహించనున్నారు.