HomeDevotionalతిరుమలలో వైభవంగా పుష్పాల  ఊరేగింపు

తిరుమలలో వైభవంగా పుష్పాల  ఊరేగింపు

శ్రీవారి భక్తులకు మెరుగైన సౌకర్యాలు, సేవలు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక టీటీడీ తీసుకున్న చర్యల వలన అందుతున్నాయని, ప్రభుత్వానికి ఆ దేవ దేవుని అండ దండలు ఆశీస్సులు ఉండాలని కోరుకున్నాను అని ఆం.ప్ర రాష్ట్ర గృహ నిర్మాణ మరియు సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. శనివారం ప్రాతః కాల సమయంలో తిరుమల శ్రీవారిని గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార పౌర సంబంధాల శాఖామాత్యులు దర్శించుకున్నారు. ముందుగా ధ్వజ స్తంభానికి మొక్కులు చెల్లించుకుని శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రికి రంగనాయక మండపం నందు వేద పండితులు ఆశీర్వచనం పలికారు.

దర్శన అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మంత్రి మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం జరిగిందని, అన్ని వసతులు మెరుగుపడినట్లు తెలుస్తోందని అన్నారు. కొంతమంది భక్తులతో మాట్లాడినప్పుడు వారు దర్శనం ఏర్పాట్లు, ప్రసాదము, అన్న ప్రసాదము, వసతి తదితర ఏర్పాట్లలో టీటీడీ మరియు కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల భక్తులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వ పాలనలో అన్ని విధాల వెనుకబడ్డ మన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించి దేశంలోనే మన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడానికి నిరంతరం కృషి చేస్తున్న కూటమి ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆ దేవ దేవుడి ఆశీస్సులు మెండుగా ఉండాలని శ్రీవారిని కోరుకున్నాను అని తెలిపారు. అలాగే ప్రజలకు, అన్ని విధాలా సిరి సంపదలను ఆయు ఆరోగ్యాలను ప్రసాదించాలని కోరుకున్నానని మంత్రి తెలిపారు.తిరుమలలో వైభవంగా పుష్పాల  ఊరేగింపు..వైభవంగా శ్రీ‌వారికి స్నపనతిరుమంజనం జ‌రిగాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img