HomeEntertainmentఇండియాకి.. గోల్డెన్ కిరీటం

ఇండియాకి.. గోల్డెన్ కిరీటం

పంజాబ్‌కు చెందిన 20 ఏళ్ల రేచల్ గుప్తా ప్రతిష్ఠాత్మక ‘మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024’ కిరీటాన్ని అందుకున్నారు. బ్యాంకాక్‌లో జరిగిన ఈ పోటీల్లో 70 దేశాలకు చెందిన సుందరాంగులు పాల్గొన్నారు. వారందరినీ వెనక్కి నెట్టి రేచల్ టైటిల్ సాధించారు. ఈ విజయంతో రేచల్ ‘గ్రాండ్ పీజెంట్ చాయిస్’ అవార్డును కూడా గెలుచుకుని మిస్ యూనివర్స్ 2000 లారా దత్తా సరసన చేరారు.ఈ విజయాన్ని రేచల్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసుకున్నారు.

మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 విజేతగా నిలిచిన ఆమె గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రపంచ శాంతి, స్థిరత్వంపై ప్రచారం కల్పిస్తారు. భారతదేశ చరిత్రలోనే తొలిసారి గోల్డెన్ క్రౌన్‌ను గెలుచుకున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా తనపై విశ్వాసం ఉంచిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఏడాది ఆగస్టులో మిస్ గ్రాండ్ ఇండియా టైటిల్ గెలుచుకున్న రేచల్ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీలకు అర్హత సాధించారు. రేచల్ 2022లో ‘మిస్ సూపర్ టాలెంట్ ఆఫ్ ద వరల్డ్’ టైటిల్ కూడా సాధించారు. ఇన్‌స్టాలో ఆమెకు మిలియన్ మంది ఫాలోవర్లు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img