HomePoliticalజగన్ కి.. ఇప్పుడు మీడియా గుర్తొచ్చిందా

జగన్ కి.. ఇప్పుడు మీడియా గుర్తొచ్చిందా

సీతంపేట లోని జనసేన పార్టీ నగర కార్యాలయంలో ఎమ్యెల్యే, జనసేన పార్టీ విశాఖ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వ‌హించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ సిఎం జగన్ మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలో మీడియాలో ఎక్కువగా కనిపిస్తున్నారు. అధికారంలో ఉన్నపుడు మీడియా ముందుకు రాలేదు అని మండి పడ్డారు. ఐదేళ్లు ఇంట్లో వున్నారు. రెడ్ బుక్ సంప్రదాయం వచ్చింది. విశాఖలో ఇల్లు కూల్చింది మీరే అని దుయ్య‌బట్టా రు. ఇప్పుడు నీతి కబుర్లు చెబుతున్నారు. జగన్ ముందు.. ముద్దులు పెడతారు, తరువాత రొడ్డుపైకి తీసుకోస్తారు అని గుర్తు చేశారు. మాయ మాటలు ప్రజలు నమ్మరు. గుడ్ బుక్ ఎక్కడ వుంది. దొంగలు దౌర్జన్యాలు ప్రోత్సహిస్తావ్. నమ్ముకున్న వారు పుట్ట గతులు లేకుండా పోయారు. మోస పోయారు. తలుపులు తెరిస్తే ఉన్న‌ పది మంది కూడా బయటకు వెళ్లి పోతారన్నారు. రాష్ట్రంలో ప్రజా రంజక పాలన. పోల వరం పూర్తి చేయ లేదు. మద్య పానం నిషేధం, రెండు లక్షల ఉద్యోగాలు అన్నావ్. నాలుగు నెలల్లో ప్రజా వ్యతిరేకత వచ్చింది అని జగన్ అనడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు.

ఎక్సైజ్ శాఖ లో 20 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు తో ఈ శాఖ ఉనికి కోల్పోయింది. ఇసుక ర్యాంప్ లు, మెటల్ మీద దోపిడీ చేసి
బతికే వారు. వైసిపి హయాంలో ఎక్సైజ్ శాఖ నిర్వీర్యం అయ్యేలా ప్రభుత్వం మద్యం షాపులు ఏర్పాటు చేశారు. కూటమి వచ్చాక ఎక్సైజ్ శాఖ పునరుద్ధరణ చేశారు. మిధున రెడ్డి మూడు కోట్లు వంతున ముడుపులు వసూలు చేశారు. అట్ట పెట్టలు కూడా కుం బకోణం చేశారు. మైన్స్ రెండు కోట్లు వసూలు చేశారు. రాజ్ రెడ్డి ద్వారా మిథున్ రెడ్డి లీలలు బయటకు వస్తాయి. ఈ కుంభకోణాలు మీద విచారణ చేయాలి అని సిఎం ను కోరారు. విశాఖ పర్యటనకు వచ్చే ఎక్సైజ్ శాఖ మంత్రి కి వినతి పత్రం అందజేస్తాను. ప్లాస్టిక్ నవ్వులతో ప్రజలను మోసం చేసిన జగన్ కు షర్మిల , తల్లి అన్న లెక్క లేదు. విజయ సాయి రెడ్డి నీ వాడుకుని వదిలేస్తారు అని తెలుసు. మాజీ ఎం.పీ. ఎం వీ వి , కాటరాజు ఇద్దరూ వెధవలు అని విమర్శించారు. జీ వీ ఎం సీ జోన్ 3ని జోన్ 2లోకి మారుస్తామనీ తెలిపారు. వన్ టౌన్ విక్టోరియా ఆస్పత్రి నీ కార్పొరేట్ స్థాయిలో అభివృధ్ధి చేస్తాం అని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img