యానిమల్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది బాలీవుడ్ భామ త్రిప్తి డిమ్రి . ఈ సినిమా ఇచ్చిన హిట్‌తో ఓవర్‌నైట్‌గా స్టార్‌గా మారడమే కాకుండా వరుస సినిమాలు చేస్తుంది. అయితే ఈ భామ తాజాగా నాసిక్‌లోని త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించింది. సామన్య భక్తురాలిగా ఎవరు గుర్తుపట్టకుండా మాస్క్ పెట్టుకుని గుడిలోకి వెళ్లి త్రయంబకేశ్వరుడిని దర్శించుకుంది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ ఫొటోలలో త్రిప్తి కాషాయ రంగు కుర్త ధరించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.సినిమాల విషయానికి వస్తే.. ‘యానిమల్’ సినిమా తర్వాత ఈ బ్యూటీ ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్’తో పలకరించారు. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా ఆనంద్ తివారీ తెరకెక్కించారు. ప్రస్తుతం ఇది అమెజాన్ ప్రైమ్ వేదికగా అందుబాటులో ఉంది.