HomeDevotionalపాలకమండలి సమావేశం.. ముఖ్యాంశాలు

పాలకమండలి సమావేశం.. ముఖ్యాంశాలు

టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన అన్నమయ్య భవనంలో పాలకమండలి సమావేశం ముఖ్యాంశాలు..తిరుపతి ఘటనలో మృతిచెందిన వారికి కుటుంబాలకు టీటీడీ ప్రగాఢ సంతాపం. తొక్కిసలాట ఘటనలో మృతిచెందిన ఆరుగురు కుటుంబాలకు బోర్డు సభ్యులు రూ 25 లక్షల పరిహారం అందజేయాలని తీర్మానం.తీవ్రంగా గాయపడ్డ ఇద్దరు భక్తులకు రూ 5 లక్షలు పరిహారం.స్వల్పంగా గాయపడ్డ 31 మంది భక్తులకు రూ 2 లక్షలు పరిహారం.న్యాయ విచారణ నివేదిక వచ్చాక బాధ్యులపై చర్యలు తీసుకుంటాం.తప్పిదం జరిగింది వాస్తవం….తప్పు చేసినవారిపై ఉపేక్షించే పరిస్థితి లేదు.జరిగింది ఓ దురదృష్టకరమైన సంఘటన…ఇలాంటి ఘటనలు పునారవృతం కాకుండా చర్యలు తీసుకుంటాం.మిగిలిన 7 రోజులకు సంభందించి వైకుంఠద్వార దర్శనానికి ఏరోజుకు ఆరోజే టోకన్లు జారీ చేస్తాం.వైకుంఠద్వార దర్శనంపై సీఎం అభిప్రాయాలపై చర్చిస్తాం.ఈ యేడాది పదిరోజుల వైకుంఠ ద్వార దర్శనాలు ఇలానే కొనసాగుతాయి.మృతిచెందిన 6 కుటుంబాల్లోని పిల్లల విద్య ఖర్చులు టీటీడీ భరిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read