HomeDevotionalభ‌క్తుల కోసం టిటిడి ప్ర‌య‌త్నం

భ‌క్తుల కోసం టిటిడి ప్ర‌య‌త్నం

సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు పలు సేవలు విఐపి బ్రేక్ దర్శనాలు, సర్వదర్శనాలు కలిపి శ్రీవారిని భక్తులు దర్శించుకునేందుకు టిటిడి ఎంతో ప్రయత్నిస్తోంది. క్యూలైన్ మేనేజ్మెంట్ లో కొత్త కొత్త ఆలోచనలు చేస్తోంది. ఎక్కువమంది సామాన్య భక్తులకు వెంకన్న దర్శనం కల్పించాలని తపిస్తోంది. ఇందులో భాగంగానేరెండు రోజుల్లో 1,72,565 మందికి శ్రీవారి దర్శనం కల్పించినట్లు టిటిడి పేర్కొంది.శ్రీవారి దర్శనాల్లో సామాన్య భక్తులకు పెద్దపీట వేసే ప్రయత్నం చేసినట్లు కొత్త విధానాన్ని తెరమీదికి తెచ్చింది. వారాంతపు రోజుల్లో శని, ఆదివారాల్లో అత్యధిక మంది భక్తులకు శ్రీవారిని దర్శించుకునేలా టీటీడీ చర్యలు చేపట్టినట్లు ప్రకటన విడుదల చేసింది.ఈ నేపథ్యంలో గత శని, ఆదివారాల్లో 1,72,565 మందికి టీటీడీ శ్రీవారి దర్శనం కల్పించగా శనివారం 88,076 మంది, ఆదివారం 84,489 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకునే అవకాశం కల్పించింది. ఇందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది.

నారాయణగిరి షెడ్ల వద్ద ఏర్పాటు చేసిన సర్వీస్ లైన్ ను భక్తులకు అందుబాటులోకి తెచ్చింది. సర్వీస్ లైన్ ద్వారా క్యూలైన్ లో వేచి ఉండే సమయం తగ్గించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లు, నారాయణగిరి షెడ్లు నిండిపోయాక భక్తులను ఆలయం బయట కిలోమీటర్ల కొద్ది క్యూ లైన్ లో నడిపించకుండా సర్వీస్ లైన్ ను వినియోగించింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ఔటర్ క్యూలైన్లు, నారాయణగిరి షెడ్ల ను నిరంతరం పర్యవేక్షించిన టీటీడీ సిబ్బంది, శ్రీవారి సేవకుల సహకారంతో భక్తులకు క్యూలైన్లలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు చేపట్టింది. క్యూలైన్లలోని భక్తులకు అల్పాహారం, పాలు, తాగు నీటిని 24 గంటలు పంపిణీ చేసిన టిటిడి భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు అన్నీ ఏర్పాట్లు చేసింది. దీంతో సర్వీస్ లైన్ సామాన్య భక్తుడికి నడక సమయాన్ని సేవ్ చేసింది. ఎక్కువ సమయం క్యూలైన్ లో ఉండకుండా శ్రీవారిని దర్శించుకునే భాగ్యం కలిగింది.

తిరుమలలో రద్దీ ఉండే రోజులు, వారాంతపు సెలవు దినాలు, పర్వదినాల్లో టీటీడీ ఎక్కువమంది భక్తులకు గతంలోనూ దర్శన అవకాశం కల్పించింది. సుప్రభాతం నుంచి ఏకాంత సేవ వరకు పలు సేవలు, విఐపి సిఫారసు లేఖలు, శ్రీవాణి టికెట్స్, ప్రత్యేక ప్రవేశ దర్శనం టైం స్లాటెడ్ టోకెన్లు, సర్వదర్శనం టోకెన్లతో భక్తులు శ్రీవారిని దర్శించుకునే భక్తులు రోజుకు 90 వేల దాకా కూడా దర్శించుకున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఇందుకు టిటిడి క్యూలైన్ మేనేజ్మెంట్ చేసింది. ఇప్పుడు సర్వీస్ లైన్ సహకారంతో రెండు రోజులకు లక్ష 70 వేల మంది భక్తులకు దర్శనం కల్పించిన టిటిడి రెండు రోజులకు దాదాపు 1.80 లక్షల మందికి పైగానే భక్తులకు స్వామివారి దర్శనాన్ని కల్పించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img