HomeEntertainmentసినీ ఇండ‌స్ట్రీపై ప‌గ‌బ‌ట్టిన.. రేవంత్ రెడ్డి

సినీ ఇండ‌స్ట్రీపై ప‌గ‌బ‌ట్టిన.. రేవంత్ రెడ్డి

సినీ ఇండస్ట్రీపై సీఎం రేవంత్‌ పగబట్టారని కేంద్రమంత్రి బండి సంజయ్‌ విమర్శించారు. అల్లు అర్జున్‌ వ్యక్తిత్వాన్ని హననం చేస్తున్నారని మండిపడ్డారు. సంధ్య థియేటర్ ఘటనలో మహిళ మృతిచెందడం బాధాకరమన్నారు. ఆ విషయాన్ని అందరూ ఖండించారన్నారు. శ్రీతేజ్‌ కోలుకోవాలని అంతా కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. ఎంఐఎంతో కలిసి సినిమా లెవల్‌లో సీఎం కథ అల్లారంటూ విమర్శించారు. సమస్య ముగిసిన తర్వాత కూడా సీఎం మళ్లీ లేవనెత్తారని తప్పుబట్టారు. అసెంబ్లీ వేదికగా ఇండస్ట్రీని దెబ్బతీసే కుట్ర చేశారన్నారు. గురుకుల విద్యార్థుల మరణాలపై స్పందించారా అంటూ బండి సంజయ్‌ ప్రశ్నించారు. మీకో న్యాయం.. ఇతరులకో న్యాయమా అని నిలదీశారు.ఇప్పటికైనా రేవంత్‌ కక్ష సాధింపులు మానాలని బండిసంజయ్ హితవు పలికారు.

సినిమా పరిశ్రమ ప్రముఖులు చెన్నైకి వెళ్లాలని చర్చించుకుంటున్నారు: ఎర్రబెల్లి దయాకర్‌

అలాగే హీరో అల్లుఅర్జున్‌పై కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫైర్‌ అయ్యారు. జరిగిన ఘటనపై అల్లుఅర్జున్‌ ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఘటన జరిగిన రోజే ప్రెస్‌మీట్‌ పెట్టి కుటుంబానికి అండగా నిలవాలన్నారు. ఈ ఘటనపై బీఆర్‌ఎస్ నాయకులు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పోలీసుల నిర్లక్ష్యంతోనే సంధ్య ధియేటర్‌ దగ్గర తొక్కిసలాట జరిగిందని బీఆర్‌ఎస్‌ నేత ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఆ ఘటనలో మహిళ మృతిచెందడం బాధాకరమన్నారు. ఆ కుటుంబాన్ని ప్రభుత్వం, సినిమా పరిశ్రమ ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అల్లు అర్జున్‌ మీద కేసుపెట్టి.. ఇబ్బంది పెట్టారని, అసెంబ్లీలో సీఎం రేవంత్‌ ఘోరంగా మాట్లాడారని ఎర్రబెల్లి దయాకర్‌ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో సినిమా పరిశ్రమ ప్రముఖులు మళ్లీ చెన్నైకి వెళ్లాలని చర్చించుకుంటున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img