తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండూ కలిసి నాటకాలు చేస్తున్నాయని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. కాళేశ్వరం కుంభకోణం, ఫోన్ ట్యాపింగ్, ధరణి కుంభకోణాల్లో బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేస్తామని కాంగ్రెస్ చెప్పిందని బండి సంజయ్ గుర్తుచేశారు. అంతేకాకుండా దీపావళికి ముందే తెలంగాణలో బాంబులు పేలుతాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన గుర్తుచేశారు. దీపావళి పండగ పోయి త్వరలోనే సంక్రాంతి పండగ కూడా రాబోతోంది కానీ కాంగ్రెస్ నేతలు చేసిందేమీ లేదన్నారు.
బీఆర్ఎస్ నేతల గురించి అన్ని మాటలు చెప్పిన కాంగ్రెస్ నేతలు, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అర్థం కావడం లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హై కమాండ్ ను కలవడంతోనే ఈ కుంభకోణాలు అన్నీ ఏమైపోయాయో ఏమోనని కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.తెలంగాణలో ప్రస్తుతం ఇద్దరుసీఎంలు ఉన్నారని.వారిలోఒకరు రేవంత్ రెడ్డి కాగా మరొకరుకేటీఆర్ అని బండి సంజయ్ అభిప్రాయపడ్డారు.కేటీఆర్ నటనచూసిజనం నవ్వుకుంటున్నారని అన్నారు.సంగారెడ్డిలో మీడియాతోమాట్లాడుతూబండి సంజయ్ ఈ వ్యాఖ్యలుచేశారు