భారత్ లో దొంగతనానికి గురై వివిధ మార్గాల ద్వారా తమ దేశానికి చేరిన 1,400కు పైగా కళాఖండాలు, వస్తువులను అమెరికా తిరిగిచ్చింది. వీటి విలువ $10 మిలియన్లు ఉంటుందని తెలిపింది. ఇందులో ఖగోళ నర్తకి ఇసుక రాయి శిల్పం అరుదైనదని, ఇది ఇండియా నుంచి లండన్ కు, అక్కడి నుంచి అమెరికా
మ్యూజియంకు చేరిందని వెల్లడించింది. అక్రమరవాణాదారుల నెట్వర్క్స్ పై ఫోకస్ చేశామని, దీని వెనుక తమిళనాడుకు చెందిన సుభాష్ కపూర్ హస్తం ఉందని
పేర్కొంది.