HomeEntertainmentఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సెట్ లో..మెగాస్టార్

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సెట్ లో..మెగాస్టార్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఖాతాలో ఉన్న మ‌రో చిత్రం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. హరీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ చిత్రం ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న‌ట్టు సమాచారం. ప‌లు కీల‌క స‌న్నివేశాల‌ను ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో తెర‌కెక్కిస్తున్నాడు హ‌రీశ్ శంక‌ర్. అయితే ఈ మూవీ సెట్‌కి మెగాస్టార్ చిరంజీవి రావ‌డంతో సంద‌డి వాతావ‌ర‌ణం నెల‌కొంది. సోమ‌వారం రోజు ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ సెట్‌లో అడుగుపెట్టిన చిరంజీవి చిత్రీకరణను దగ్గరుండి వీక్షించారు. దీనికి సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది. ఇందులో చిరు షూటింగ్ సీన్​ను చూస్తుండగా, పవన్ కల్యాణ్ పక్కనే ఉండ‌డం మ‌నం చూడ‌వ‌చ్చు.ప్ర‌స్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్​గా మారింది. మెగా బ్రదర్స్ ఇద్ద‌రు చాలా రోజుల త‌ర్వాత క‌లిసి క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు. ఇక ఈ చిత్రంలో రియ‌ల్ లైఫ్ సీన్‌ని హ‌రీష్ ప్లాన్ చేసిన‌ట్టు స‌మాచారం. పవన్ కల్యాణ్​ ఆ మ‌ధ్య ఓ సందర్భంలో కారు రూఫ్​పై కూర్చొని ప్ర‌యాణించ‌డం మ‌నం చూశాం. ఆయ‌న కారు టాప్​పై కూర్చొని వెళుతుండ‌గా, కారుకు ఇరువైపులా సెక్యూరిటీ, వెనకాల బైకులపై అభిమానులు వెళ్లారు.

ఈ వీడియో అప్పట్లో సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. ఇప్పుడు ఈ సీన్‌ని రీ క్రియేట్ చేసి సినిమాలో పెట్ట‌నున్నాడ‌ట హ‌రీష్ శంక‌ర్. ఒకవేళ ఈ సీన్ సినిమాలో ఉంటే, థియేటర్లలో ఫుల్ విజిల్స్ పడడం పక్కా అని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ సరసన యువ నటి శ్రీలీల సందడి చేయనుంది. ఈ సినిమాకు దర్శకుడు దశరథ్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. సాక్షి వైద్య, అశుతోష్ రానా, గౌతమి, నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజీఎఫ్ ఫేమ్ అవినాష్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read