ఎన్నికల సమయంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, పవన్ కళ్యాణ్ ఓపెన్ టాప్ జీపులో కూర్చున్న స్టిల్ ఇప్పటికి కూడా బెస్ట్ మూమెంట్. ఆయన వెనుక వేలాదిగా అభిమానులు బైకులు, కార్లలో ఫాలో అవుతున్న వీడియో అప్పట్లో వైరల్ అయింది. ఇప్పుడు ఇదే సీన్‌ను ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో హరీష్ శంకర్ రీ-క్రియేట్ చేస్తున్నట్టు వెల్లడించాడు.ఒక రీమేక్ సినిమాలో ఎలా ఇమిడుతుందనే సందేహం సహజం. కానీ హరీష్ శంకర్ తన స్టైల్‌కి తగ్గట్టుగా స్క్రిప్ట్‌లో మార్పులు చేసి, పవన్ అభిమానుల్ని థ్రిల్ చేసేలా ప్రెజెంట్ చేయడంలో మాస్టర్. గతంలో గబ్బర్ సింగ్లోనూ అసలు వెర్షన్‌లో లేని అనేక మాస్ ఎలిమెంట్స్‌ని జోడించి, సినిమాను మరింత పవర్‌ఫుల్‌గా మలిచాడు. గద్దలకొండ గణేష్లోనూ అదే ఫార్ములా వర్కౌట్ అయ్యింది. కాబట్టి, ఉస్తాద్ భగత్ సింగ్ లొనూ కొత్త మాస్ ఎలిమెంట్స్ తప్పకుండా ఉండబోతున్నాయని చెబుతున్నారు.
