HomeEntertainmentనీకు ప్రైవేట్ జెట్ విమానాన్ని గిఫ్ట్ ఇస్తున్నా

నీకు ప్రైవేట్ జెట్ విమానాన్ని గిఫ్ట్ ఇస్తున్నా

ఘరానా మోసగాడు సుఖేశ్ చంద్రశేఖర్ ప్రేమికుల రోజు సందర్భంగా బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఉద్దేశించి ఘాటైన ప్రేమలేఖ రాశాడు. ఆర్థిక మోసాల కేసులో అరెస్టయిన సుఖేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్నాడు. జైలు నుంచే అతడు జాక్వెలిన్ కు లవ్ లెటర్ రాశాడు. మరో జన్మంటూ ఉంటే నీ హృదయంలా జన్మనిస్తానని పేర్కొన్నాడు. హ్యాపీ వాలెంటైన్స్ డే బేబీ… ఈ సంవత్సరం మనకు అంతా మంచే జరుగుతుందన్న నమ్మకం ఉంది. జీవితకాలం లవర్స్ డేని సెలెబ్రేట్ చేసుకునేందుకు మనం ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం. ఈ ప్రపంచంలో నువ్వు అద్భుతమైన ప్రేయసివి. నీలాంటి బ్యూటిఫుల్ అమ్మాయిని లవర్ గా కలిగి ఉన్నందుకే ఈ భూమ్మీద నా అంత అదృష్టవంతుడు ఇంకెవరూ ఉండరేమో. నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ. నాకు ఒక్కటే కోరిక… వచ్చే జన్మలో నీ హృదయాన్నై పుడతాను. ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా నీకొక అపురూపమైన కానుక ఇస్తున్నా. నువ్వు నీ కెరీర్ పనుల మీద విదేశాలకు వెళుతుంటావు… అందుకే నీకు ఒక ప్రైవేట్ జెట్ విమానాన్ని కానుకగా ఇస్తున్నా. ఆ విమానంపై నీ పేరులోని తొలి అక్షరాలు ముద్రించి ఉంటాయి… ఆ విమానం రిజిస్ట్రేషన్ నెంబరు కూడా నీ పుట్టినరోజు తేదీనే. ఈ విమానంలో నువ్వు ఎంతో సౌకర్యవంతంగా ప్రయాణిస్తావని ఆశిస్తున్నాను” అంటూ సుఖేశ్ చంద్రశేఖర్ తన ప్రేమలేఖలో పేర్కొన్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img