విక్కీ కౌశల్ నటించిన ఛావా .. బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొడుతోంది. వీకెండ్‌లో ఈ మూవీ .. 164.75 కోట్లు వసూల్ చేసింది. ఈ యేడాది మూడు రోజుల్లో అంత భారీ అమౌంట్ జనరేట్ చేసిన ఫస్ట్ హిందీ ఫిల్మ్‌గా ఛావా నిలిచింది. ఈ ఫిల్మ్‌లో రష్మిక మందానా కూడా నటించింది. గత నెలలో రిలీజైన తొలి మూడు రోజుల్లోనే అక్షయ్ కుమార్ నటించిన స్కైఫోర్స్ 140 కోట్లు వసూల్ చేసింది. అయితే స్కైఫోర్స్ కలెక్షన్లను ఛావా దాటేసింది.సాక్‌నిల్క్ వెబ్‌సైట్ ప్రకారం.. ఛావాకు 164.75 కోట్లు వచ్చాయి. ఇండియాలో ఈ మూవీకి 139 కోట్లు వసూల్ కాగా, విదేశాల్లో ఈ చిత్రం మరో 25 కోట్లు ఆర్జించింది. మిమి ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఫిబ్రవరి 14వ తేదీన ఛావా చిత్రం రిలీజైంది. మాడాక్ ఫిల్మ్స్‌కు చెందిన దినేశ్ విజన్ దీన్ని నిర్మించారు.మరాఠా యోధుడు ఛత్రపతి సంబాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా ఈ ఫిల్మ్‌ను రూపొందించారు. విక్కీ కౌశల్ దీంట్లో ప్రధానపాత్ర పోషించారు. ఆయన భార్య యెసుబాయ్ పాత్రను రష్మిక పోషించింది.