నరసరావుపేట సబ్ జైలు వద్ద మాజీమంత్రి విడదల రజిని కామెంట్స్.రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు,నేతలపై తప్పుడు కేసులు పెట్టడం కోసమే రెడ్ బుక్ ఓపెన్ చేశారు.అబద్ధపు హామీలు ఇచ్చి ప్రభుత్వం అధికారంలోకి వచ్చారు.ఆ హామీలను సోషల్ మీడియాలలో ప్రశ్నిస్తే మా కార్యకర్తలపై కేసు పెడుతున్నారు.చిలకలూరిపేటలో మా కార్యకర్త రాకేష్ ని అన్యాయం గా అరెస్టు చేశారు.కూటమి ప్రభుత్వ నేతలు ప్రజలకు చక్కటి అందమైనకట్టుకధలు చెబుతున్నారు.ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు ఆదేశాలతోనే పోలీసులు తప్పుడు కేసు పెట్టారు.చిలకలూరిపేటలో అసలు జరగని విషయానికి కేసు కట్టారు.
చిలకలూరిపేట పోలీసులు BNS సెక్షన్ ని సైతం దుర్వినియోగం చేస్తున్నారు.క్రైం జరిగిన అదేరోజు రాకేష్ గుంటూరులో ఉన్నాడు.ఇదే కేసులో పనింద్ర అనే వ్యక్తికి సంభందం లేకపోయి నా ఇరికించారు.కూటమి ప్రభుత్వం పిచ్చి పరాకాష్టకి చేరింది అనే దానికి ఈ కేసు ఒక ఉదాహరణ.రాకేష్ అనే వ్యక్తి నాకు వ్యక్తిగత టార్గెట్ అని ఎమ్మెల్యే పుల్లారావు చెప్పాడు.పోలీసులు అత్యుత్సాహం చూపిస్తే పెద్ద ఎత్తునన్యాయ పోరాటం చేస్తాం తప్పు చేసిన పోలీసులను తప్పకుండా న్యాయస్థానం లో నిలబెడతాం.రాజకీయ నేతల మెప్పు కోసం పోలీసులు పాకులాడొద్దు..నా మీద నాకుటుంబ సభ్యులపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది.పోలీసులారా గుర్తుపెట్టుకోండి ..ఈ పాపాలకు ఎందుకు పాల్పడ్డామా అని మీరు బాధపడే రోజు వస్తుంది.