రామ్ తాళ్లూరి నిర్మించిన వికటకవి సిరీస్ కి, ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ డిటెక్టివ్ సిరీస్ లో, హీరోకి జోడీగా మేఘ ఆకాశ్ అలరించనుంది. తెలంగాణ నేపథ్యంలో రూపొందిన ఫస్టు డిటెక్టివ్ సిరీస్ గా దీనిని చెబుతున్నారు. జీ 5 ప్లాట్ ఫామ్ పై ఈ నెల 28 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది.ఈ కథ 1940లలో… 1970లలో నడుస్తుంది. ఆ కాలాలకి సంబంధించిన వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ ఈ కథను నడిపించడం అంత తేలికైన విషయం కాదు. ఆ కాలాలకు సంబంధించిన సామాజిక జీవన విధానాన్ని చూపించడానికి ఎంతో కసరత్తు చేయవలసి ఉంటుంది. అలాంటి ఒక కష్టతరమైన కంటెంట్ తో నిర్మితమైన ఈ సిరీస్ ఇప్పుడు అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. 1940లలో ‘అమరగిరి’ ప్రాంతంలో ఒక మరిచిపోలేని సంఘటన జరుగుతుంది. 1970లలో అదే సంఘటన మళ్లీ జరుగుతుంది. దాంతో అందుకు కారణం తమ గ్రామదేవతకి కోపం రావడమేనని అక్కడి వాళ్లంతా భావిస్తారు. ఈ విషయాన్ని ఛేదించడానికి డిటెక్టివ్ ‘వికటకవి’ రంగంలోకి దిగుతాడు. ఫలితంగా ఏం జరుగుతుందనేది కథ.