విశ్వ హిందూ పరిషత్ అఖిల భారత సంఘటన ప్రధాన కార్యదర్శి మిలింద్ పరాండే .. ఆఖిల భారత ఉపాధ్యక్షులు గోకరాజు గంగరాజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంధ్రబాబు నాయుడు ని కలిసి దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కలిగించాలని కోరుతూ, VHP తయారు చేసిన ముసాయిదా ప్రతిని అందించారు. అలాగే విజయవాడలో 5 జనవరి 2025 వ తేదీన జరగబోయే “హైందవ శంఖారవం” బహిరంగ సభ వివరాలను తెలియజేశారు.ఈ సమావేశంలో గుమ్మళ్ళ సత్యం జీ, శ్రీవేంకటేశ్వర్లు జీ, దుర్గా ప్రసాదరాజు జీ, మరియు టీ. సత్య రవికుమార్ జీ పాల్గొన్నారు.