HomeEntertainmentనన్ను చూసే ఓటేయండి – హీరో విజయ్

నన్ను చూసే ఓటేయండి – హీరో విజయ్

తమిళ హీరో విజయ్ .. రాజకీయాల్లోనూ హీరోయిజమే చూపించాలని డిసైడయ్యారు. దానికి తగ్గట్లుగా ఆయన చేసిన ప్రకటన వైరల్ అవుతోంది. పార్టీ రెండో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మధురై జిల్లాలోని పరపతిలో భారీ బహిరంగసభ ఏర్పాటు చేశారు. ఇందులో ఆయన ఓ ప్రకటన చేశారు. పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తున్నానని చెప్పి..అన్నీ తన పేర్లనే ప్రకటించుకున్నారు. అంటే.. అన్ని చోట్లా తమిళనాడు అంతటా ఉన్న 234 నియోజకవర్గాలకు నేను అభ్యర్థిని. అలా ఆలోచించి, మీరందరూ ఓటు వేయాలని ప్రజలను కోరారు.

కొంత మంది నటుల మాదిరిగా మార్కెట్ పోయాక రాజకీయాల్లోకి రాలేదన్నారు. తాను అన్నింటికి సిద్ధంగా ఉన్నానని తాను ఎంత చేసినా ప్రజల కృతజ్ఞతా రుణం నేను తీర్చుకోలేనన్నారు. నా పని ప్రజల కోసం పనిచేయడమని చెప్పుకున్నారు. తన పార్టీ విజయం ఓ చారిత్రక నిర్ణయంగా విజయ్ చెప్పుకొచ్చారు. 1967లో డీఎంకే, 1977లో అన్నాడీఎంకేలతో ఎలా మార్పు వచ్చిందో 2026 అసెంబ్లీ ఎన్నికలలో కూడా టీవీకే అలాంటి మార్పు తెస్తుందన్నారు. ఈ సభలో విజయ్ బీజేపీతో పొత్తు పెట్టుకునే ప్రసక్తే ఉండదని తేల్చారు. డీఎంకేను రాజకీయ శత్రువుగా.. బీజేపీని భావజాల శత్రువుగా చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read