HomeEntertainmentఆగ‌స్ట్ 14న వార్2

ఆగ‌స్ట్ 14న వార్2

యష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ గురించి ఓ నెటిజన్ పోస్ట్ పెడుతూ ‘వార్ 2’ మూవీ గురించి ప్రస్తావించాడు. దీనిపై సదరు నిర్మాణ సంస్థ స్పందిస్తూ గుడ్ న్యూస్ చెప్పింది ..మేము వార్ 2 మార్కెటింగ్ ప్రారంభించక ముందే అద్భుతంగా సెటప్ చేశారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్ట్ 14న థియేటర్లలో అల్లకల్లోలం సృష్టిస్తుంది అంటూ పోస్ట్‌లో రాసుకొచ్చారు. దీంతో అభిమానుల ఆనందం హ‌ద్దులు దాటింది. ఇద్ద‌రు ప‌వ‌ర్ ఫుల్ హీరోస్ తెర‌పై జంట‌గా క‌నిపిస్తే ఆ సంద‌డి పీక్స్‌లో ఉంటుంది. హృతిక్, ఎన్టీఆర్ ప‌ర్‌ఫార్మెన్స్ చూడ‌డానికి రెండు క‌ళ్లు స‌రిపోవు అని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా ఆగస్టు 14న రిలీజ్ చేస్తారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. అయితే, ఇటీవల హృతిక్ రోషన్‌కు గాయం కావడంతో షూటింగ్‌కు బ్రేక్ పడిందని.. అనుకున్న టైంకు మూవీ రిలీజ్ కాదేమో అనే అనుమానాలు నెల‌కొన‌గా, ఎట్ట‌కేల‌కి క్లారిటీ వ‌చ్చేసింది. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా తెరకెక్కిన స్పై థ్రిల్లర్ మూవీ ‘వార్ కాగా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా వార్ 2 వస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్, హృతిక్ ప్రధాన పాత్రలు పోషిస్తుండగా.. ఎన్టీఆర్ రా ఏజెంట్‌గా కనిపించనున్నట్లు స‌మాచారం. అయితే, ఏజెంట్ పాత్రలన్నింటి కంటే డిఫరెంట్‌గా ఈ మూవీలో ఎన్టీఆర్ పాత్ర ఉండనున్నట్లు సినీ వర్గాల సమాచారం. ఈ మూవీతోనే ఎన్టీఆర్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తుండగా.. ఆదిత్య చోప్రా నిర్మిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇక ఈ మూవీ త‌ర్వాత ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ చిత్రం షూటింగ్‌లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read