HomeEntertainmentవార్ 2..అద‌ర‌గొట్టిన ట్రైల‌ర్

వార్ 2..అద‌ర‌గొట్టిన ట్రైల‌ర్

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, బాలీవుడ్ న‌టుడు హృతిక్ రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘వార్ 2’. ప్ర‌ముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ య‌శ్‌రాజ్ ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ఆదిత్య‌చోప్రా నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతున్న ఈ చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఆగస్టు 14న ఈ సినిమా వ‌ర‌ల్డ్‌వైడ్‌గా విడుద‌ల కానుంది. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ మూవీ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ ట్రైల‌ర్ ఫుల్ యాక్ష‌న్ ప్యాక్‌డ్‌గా ఉంది. ఈ ట్రైల‌ర్‌లో హీరోలిద్ద‌రీ అద్భుత డైలాగ్స్‌తో పాటు యాక్ష‌న్ హైలైట్‌గా నిలిచింది. “ఎవ‌రూ చేయ‌లేని ప‌నిని నేను చేసి చూపిస్తాను.. ఎవ‌రూ పోరాడలేని యుద్ధాన్ని నేను పోరాడుతాను” అంటూ ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్ అదిరింది. య‌శ్‌రాజ్ ఫిలిమ్స్ స్పై యూనివర్స్‌లో రాబోతున్న ఈ చిత్రంలో.. హృతిక్ రోషన్ కబీర్‌గా తిరిగి రాగా, తార‌క్‌ ప్రతినాయకుడి పాత్రలో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. కియారా అద్వానీ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read