Homeisseseవివాహ వేడుక‌లో బంధువుల‌పై నోట్ల వ‌ర్షం

వివాహ వేడుక‌లో బంధువుల‌పై నోట్ల వ‌ర్షం

ఓ వివాహ వేడుకలో బంధువులు నోట్ల వర్షం కురిపించారు. రూ.లక్షల రూపాయలను అతిథులపై వెదజల్లారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని సిద్ధార్థనగర్‌లో చోటు చేసుకుంది. పెళ్లి ఊరేగింపు సందర్భంగా వరుడి బంధువులు కొంతమంది ఇళ్లు, జేసీబీలపైకి ఎక్కారు. ఈ సందర్భంగా ఊరేగింపుకు హాజరైన అతిథులపై నోట్ల వర్షం కురిపించారు. రూ.100, రూ.200, రూ.500 నోట్లను వెదజల్లారు. ఇందుకోసం మొత్తం రూ.20 లక్షలను ఖర్చు చేసినట్లు తెలిసింది. గాల్లో ఎగురుతున్న నోట్లను దక్కించుకునేందుకు ఊరి ప్రజలు, అతిథులు ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌ అవుతోంది.ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img