HomePoliticalమహారాష్ట్ర సీఎంగా మ‌ళ్లీ 'ఫడ్నవీస్'

మహారాష్ట్ర సీఎంగా మ‌ళ్లీ ‘ఫడ్నవీస్’

మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఘన విజయం సాధించడంతో ముఖ్యమంత్రి ఎవరు అన్న ప్రశ్న తలెత్తుతోంది. అయితే బీజేపీకి సొంతంగా మెజార్టీ రాలేదు కానీ ఆ పార్టీకి 127 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.144 మంది ఉంటే ఎవరిపై ఆధారపడాల్సిన పని ఉండదు. కానీ పదిహేడు మంది తగ్గారు. కానీ మిత్రపక్షాలకు మరో వంద సీట్లు ఎక్కువగా వచ్చాయి. అయితే సీఎం పదవిపై ప్రస్తుత సీఎం శిందేతో పాటు శరద్ పవార్ ను భ్రష్టుపట్టించేసిన ఆయన మేనల్లుడు అజిత్ పవార్ కూడా ఆశలు పెట్టుకున్నారు.

గతంలో శివసేనను శిందే చీల్చినప్పుడు తమకు ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ ఏక్ నాథ్ షిండేకే సీఎం పదవి ఇచ్చారు. ముఖ్యమంత్రిగా చేసిన ఫడ్నవీస్‌కు డిప్యూటీ సీఎం పోస్టు ఇచ్చారు. తనకు గౌరవం తక్కువ అని ఫడ్నవీస్ అనుకోలేదు. హైకమాండ్ చెప్పినట్లుగా చేశారు. తర్వాత అజిత్ పవార్ వచ్చి కలిశారు. ఆయనకూ ఉపముఖ్యమంత్రి పదవి వచ్చింది.

ఇప్పుడు వారు కూడా బలమైన స్థానాలు పొందినా బీజేపీ ఈ సారి ముఖ్యమంత్రి పదవి వదులుకునే అవకాశాలు కనిపిచడం లేదు. ఇతర పార్టీల కన్నా కనీసం 70 ఎమ్మెల్యే సీట్లు ఎక్కువగా ఉన్నందున వారే సీఎం సీటును బీజేపీకి ఆఫర్ చేస్తే మంచిదని సలహా ఇస్తున్నారు. వారికి ఇప్పుడు బీజేపీని ఎదిరించే శక్తి లేదు. ఎదిరిస్తే ఏం జరుగుతుందే శిండేకు..పవార్‌కు తెలుసు. అందుకే ఫడ్నవీస్‌కు సీఎంపోస్టు ఇచ్చి తామిద్దరం చెరో డిప్యూటీ సీఎం పోస్టు తీసుకోవడానికి వారు ఫిక్సయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read

spot_img