మగాళ్లతో పోలిస్తే మహిళలకు వినికిడి శక్తి ఎక్కువగా ఉంటుందని ఓ రీసెర్చ్లో తేలింది. ఏ ప్రాంతమైనా, వయస్సుల్లో తేడాలు ఉన్నా అతివలే అన్ని రకాల శబ్దాలు మెరుగ్గా వింటారని వివరించింది. పురుషులు, మహిళల మధ్య ఈ తేడా 2 డెసిబుల్స్ వరకు ఉంటుందని పేర్కొంది. ఆడవారి చెవి నిర్మాణంలోని సూక్ష్మమైన తేడాల వల్ల ఇది సాధ్యమైనట్లు రీసెర్చ్ వెల్లడించింది. అలాగే ఎడమ చెవి కంటే కుడి చెవి సున్నితంగా ఉంటుందని చెప్పింది..