ప్రపంచ ప్రఖ్యాత మ్యూజిక్ బ్యాండ్ ‘కోల్డ్ ప్లే కన్సర్ట్ ఇండియాలో ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. కోల్డ్‌ప్లే ప్రధాన గాయకుడు క్రిస్ మార్టిన్ తన బృందంతో యువతను ఉర్రుతలు ఊగిస్తున్నాడు. ఇప్పటికే ముంబైలో జరిగిన ‘కోల్డ్ ప్లే’ కన్సర్ట్‌కి మంచి రెస్పాన్స్ రాగా.. ఈ వేడుకకు సింగర్ శ్రేయ ఘోషల్‌తో పాటు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరై సందడి చేశారు. తాజాగా అహ్మదాబాద్ లో కోల్డ్‌ప్లే సెకండ్ షో ఆదివారం ఉత్సాహంగా సాగింది. నరేంద్ర మోదీ స్టేడియం లో జరిగిన ఈ ఈవెంట్‌కు భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ముఖ్య అతిథిగా హాజరుకాగా.. అతడిపై పాట పాడి ప్రేక్షకులను అలరించాడు క్రిస్.కోల్డ్ ప్లే’ వేడుక మధ్యలో తాను తెలంగాణ వాడి నే అంటూ ప్రేక్షకులను ఆటపట్టించాడు క్రిస్. తన ఈవెంట్‌లలో తాను ఎక్కడికి వెళితే అక్కడ ఆ ప్రాంతంకి చెందిన వాడినని సరదాగా చెబుతుంటాడు. రీసెంట్‌గా ఇండియాకి వచ్చిన అతడు ముంబైలో జరిగిన ఈవెంట్‌లో తాను ముంబై వాడినని చెప్పిన ఇతడు అహ్మదాబాద్‌లో జరిగిన కన్సర్ట్‌లో తాను తెలంగాణ వాడినని అందరికి తెలుసని.. అలాగే మా బృందం కూడా ఇండియాలోని ఇతర ప్రాంతాలకు చెందినవారని తెలిపాడు. కాగా ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అయితే ఈ విషయంపై తెలంగాణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. నువ్వు మా తెలంగాణ ముద్దు బిడ్డవి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.