త్వరలోనే హీరో యష్ పుట్టిన రోజు రానుంది. దీంతో అభిమానులు యష్ పుట్టిన రోజును గ్రాండ్ గా జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గతేడాది జరిగిన విషాద సంఘటనలను దృష్టిలో ఉంచుకుని యష్ తన అభిమానులకు ఒక ప్రత్యేక సందేశం పంపాడు. తన పుట్టినరోజున ఎలాంటి ఆడంబరాలు, హంగామా వద్దని, సింపుల్ గా సెలబ్రేట్ చేసుకోవాలంటూ యష్ సోషల్ మీడియా వేదికగా తన అభిమానులను కోరారు. నేను ప్రస్తుతం టాక్సిక్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాను. సినిమా పనుల వల్ల ఈ పుట్టిన రోజున నేను ఊర్లో ఉండడం లేదు. దయచేసి మీ అందరికీ ఒక విన్నపం. నా పుట్టిన రోజున ఫ్లెక్సీలు, బ్యానర్లు అంటూ ఎలాంటి హంగులు, ఆర్భాటాలు చేయవద్దు. మరోసారి నా మనసు గాయపడేలా ప్రవర్తించకండి. మీకు ఓ కుటుంబముంది. వారికీ మీ అవసరముంది. వీలైనంత త్వరగా మీ అందరినీ కలుస్తాను. నూతన సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను’ అని అభిమానులను కోరారు యశ్. ప్రియమైన అభిమానులకు నమస్కారం. మీ ప్రేమాభిమానాలతో నాకు మరో సంవత్సరం ఎంతో విలువైనదిగా మారిపోయింది. కొత్త ఏడాదిలో కొత్త ఆశలతో చిరునవ్వుతో జీవిద్దాం, కొత్త కొత్త ప్రణాళికలతో కొత్త ఏడాదికి స్వాగతం పలుకుదాం’ అంటూ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.