రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాలలో వైసీపీ పోరుబాట కార్యక్రమం జరగనుంది.ఆంధ్రప్రదేశ్ లో మద్దతు ధర లేక అల్లాడుతున్న అన్నదాతలకు అండగా నేడు రాష్ట్రవ్యాప్తంగా పోరుబాటకు సిద్ధమైనట్లు వైసీపీ ప్రకటించింది. రైతులతో కలిసి తమ నాయకులు కలెక్టరేట్లకు ర్యాలీగా వెళ్లి వినతిపత్రాలు అందజేస్తారని తెలిపింది. రైతుల గోడు ప్రభుత్వానికి తెలిసేలా నిరసన చేపట్టనున్నట్లు వివరించింది. ధాన్యం కొనుగోలు, రూ.20 వేలు పెట్టుబడి సాయం తదితర సమస్యలపై వైసీపీ పోరాడుతుందని మాజీ సీఎం జగన్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.