వైసీపీ అధినేత జగన్ పులివెందుల పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. పులివెందుల విజయ గార్డెన్స్ లో జరిగిన సంగీత, అహ్మద్ ల వివాహానికి జగన్ తన భార్య భారతితో కలిసి వివాహానికి హాజరయ్యారు. జగన్ కు నూతన వధూవరులు పాదాభివందనం చేశారు. వారిని జగన్ దంపతులు ఆశీర్వదించారు. జగన్ తో పాటు పెద్ద సంఖ్యలో వైసీపీ నేతలు, కార్యకర్తలు కూడా వివాహానికి హాజరయ్యారు. మరోవైపు జగన్ ఈరోజు పులివెందుల పర్యటన ముగించుకుని బెంగళూరుకు తిరుగుపయనమవుతున్నారు.