వైసీపీకి మరో భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ రాజీనామా చేయబోతున్నారు. ఈరోజు ఆయన రాజీనామా చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్నికల తర్వాత నుంచి ఆయన పార్టీ కార్యకలాపాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నారు. ఆయన బయట ఎక్కడా కనిపించడం లేదు. జగన్ వ్యవహారశైలి, పార్టీ పని తీరు నచ్చకే రాజీనామా నిర్ణయానికి అవంతి వచ్చినట్టు చెపుతున్నారు. తన అనుచరులతో చర్చించిన తర్వాత ఆయన ఈ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. అయితే, ఆయన ఏ పార్టీలో చేరుతారనే విషయం ఆసక్తికరంగా మారింది.