యోగాతోనే మనిషికి ఒత్తిడి తొలగి మానసిక ప్రశాంతత లభిస్తుందని పుట్టపర్తి ,అనంతపురం నియోజకవర్గ ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి, దగ్గుబాటి వెంకట ప్రసాద్ లు పేర్కొన్నారు. అనంతపురం ఆలమూరు రోడ్డు సమీపంలోని పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించిన యోగాంద్ర కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి,పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ పల్లె వెంకట కృష్ణ కిషోర్ రెడ్డి గారితో పాటు ఎమ్మెల్యేలు పల్లె సింధూర రెడ్డి,దగ్గుబాటి ప్రసాద్ లు మాట్లాడారు. యోగాతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయమని అన్నారు. ఈనెల 21న ప్రధాని నరేంద్ర మోడీ,ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో విశాఖపట్నంలో 5 లక్షల మందితో యోగా డే కార్యక్రమాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తోందని ఇది ప్రపంచ రికార్డుగా చరిత్ర సృష్టించినట్లు తెలిపారు. అదే రోజు రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్లకు మందికిపైగా ఈ యోగాంద్ర కార్యక్రమంలో పాల్గొనున్నట్లు తెలిపారు. యోగాంద్ర కార్యక్రమం ఏపీ చరిత్ర సృష్టిస్తుందని అన్నారు. యోగాంధ్రతో మనిషి ఆరోగ్యాన్ని పొందాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీవీ కేకే ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్య ప్రతినిధి శ్రీకాంత్ రెడ్డి ,ప్రిన్సిపల్ సుబ్బారావు మన్మధేశ్వర్ రెడ్డి రమేష్ బాబు సంతోష్ కుమార్ ,శ్రీధర్ ,ప్రకాష్ , చంద్రశేఖర్ రెడ్డి , రఘు తో పాటు ఉద్యోగులు విద్యార్థులు అనంతపురం నగర స్థానిక ప్రజా ప్రతినిధులు , యోగ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
