HomeEntertainmentరెహ‌మాన్ ఔట్..సాయి అభ్యాంక‌ర్ ఇన్

రెహ‌మాన్ ఔట్..సాయి అభ్యాంక‌ర్ ఇన్

కోలీవుడ్ స్టార్ యాక్టర్ సూర్య a బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్‌లో పెట్టాడని తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్‌లో నటిస్తోన్న సూర్య 44 షూటింగ్ దశలో ఉంది. కాగా మరోవైపు ఆర్జే బాలాజీ దర్శకత్వంలో సూర్య 45 కూడా చేస్తున్నాడు. సూర్య చేతిలో గొడ్డలి పట్టుకున్న ప్రీ లుక్‌ ఒకటి నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్‌ ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే మేకర్స్‌ ఏఆర్‌ రెహమాన్‌ ప్లేస్‌లో యువ కంపోజర్‌ సాయి అభ్యాంకర్‌ను తీసుకొచ్చారు. Katchi Sera ఆల్బమ్‌తో పాపులర్ అయిన సాయి అభ్యాంకర్‌ మరి సూర్యకు ఎలాంటి సాంగ్స్ అందిస్తాడన్నది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. మరోవైపు ఈ చిత్రానికి పాపులర్ సినిమాటోగ్రఫర్‌ జీకే విష్ణు పనిచేయబోతున్నాడు. ఈ రెండు అప్‌డేట్స్‌తో అభిమానుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది సూర్య టీం. ఆర్జే బాలాజీ అండ్‌ టీం ఇటీవలే కోయంబత్తూరు అగ్రికల్చర్‌ కాలేజీలో షూటింగ్‌ సెట్ వర్క్‌ పనులకు సంబంధించిన విజువల్స్‌, స్టిల్‌ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ మూవీలో చెన్నై సుందరి త్రిష ఫీ మేల్‌ లీడ్‌ రోల్‌లో నటిస్తోంది. సూర్య 45 స్క్రిప్ట్‌లోని కోర్‌ పాయింట్‌పై ప్రభావం పడకుండా సూర్య సార్ కోసం చాలా మార్పులు చేశామని.. సినిమా టైటిల్‌ కూడా ఫైనల్ చేశామని ఆర్జే బాలాజీ క్లారిటీ కూడా ఇచ్చేశాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Must Read