యూట్యూబర్, నటుడు ప్రసాద్ బెహరాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓ వెబ్ సిరీస్ షూటింగ్ సందర్భంగా తనతో అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఓ హీరోయిన్ ప్రసాద్‌పై ఫిర్యాదు చేసింది. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి ప్రసాద్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. పెళ్లివారమండి’అనే వెబ్ సిరీస్ సమయంలో ప్రసాద్ బెహరాతో పరిచయం అయినట్లు సదరు హీరోయిన్ ఫిర్యాదులో పేర్కొంది. షూటింగ్ సమయంలో ప్రసాద్ తనని ఇబ్బందికరంగా తాకడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందట బాధితురాలు. ఈ విషయంలో తనకి ప్రసాద్ పలుమార్లు క్షమాపణలు కూడా చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
ఇది జరిగి ఏడాది తర్వాత మెకానిక్ అనే మరో వెబ్ సిరీస్‌లో ఇద్దరూ కలిసి నటించారట.అప్పుడు కూడా అలానే ప్రవర్తించడంతో షాకైనట్లు సదరు హీరోయిన్ చెప్పింది. అయితే ప్రసాద్ వరస్ట్ లాంగ్వేజ్ కారణంగా ఆ షూటింగ్ సమయంలో తనని ఇబ్బంది పెట్టినా భరించినట్లు బాధితురాలు పేర్కొంది. అయితే ఇటీవల షూటింగ్ సమయంలో యూనిట్ అందరి ముందు ప్రసాద్ తన బ్యాక్‌పై కొట్టాడని.. ఎందుకు కొట్టావని అడిగితే ఏదో జోక్ చేసినట్లు అందరి ముందు నవ్వాడంటూ ఫిర్యాదులో బాధితురాలు చెప్పింది. ఈ విషయంలో చాలా సార్లు ప్రశ్నించినప్పటికీ సరైన సమాధానం ఇవ్వలేదని.. ఆ తర్వాత బూతులు మాట్లాడుతూ తనపై ఇష్టమొచ్చినట్లు వల్గర్ కామెంట్లు చేసినట్లు బాధితురాలు చెప్పింది. ఈ విషయంపై పోలీసులకి ఫిర్యాదు చేస్తానని చెబితే చేస్తే చేసుకో పో అంటూ రూడ్‌గా బిహేవ్ చేసినట్ల కంప్లెయింట్‌లో చెప్పింది.కెరీర్ విషయానికొస్తే ప్రసాద్ ఓ యూట్యూబర్‌గా ఫేమస్ అయ్యాడు. తన వెరైటీ కంటెంట్‌తో ప్రేక్షకులను అలరించాడు.