భారత జట్టు ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా తన టెస్టు కెరీర్ లో అరుదైన ఘనత సాధించాడు. టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ల జాబితాలో జహీర్ ఖాన్, ఇషాంత్ శర్మలను వెనక్కి నెట్టి టాప్-5లోకి దూసుకొచ్చాడు.ముంబయిలో న్యూజిలాండ్తో జరుగుతున్న మూడో టెస్టులో జడ్డూ ఈ మైలురాయి అందుకున్నాడు. ఈ మ్యాచ్లో గ్లెన్ ఫిలిప్ వికెట్ తీయడం ద్వారా జడేజా ఈ రికార్డు సాధించాడు. ప్రస్తుతం జడేజా టెస్టుల్లో 312 వికెట్లతో కొనసాగుతున్నాడు. ఇక ఈ జాబితాలో లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే 619 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. అతని తర్వాతి స్థానంలో వరుసగా రవిచంద్రన్ అశ్విన్ (533), కపిల్ దేవ్ (434) ఉన్నారు.